హైదరాబాద్, వెలుగు: సాస్’ ఫిన్‌టెక్ సొల్యూషన్ ప్రొవైడర్ జగిల్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో మాజీ కన్జూమర్ బ్యాంకింగ్ హెడ్ విరాట్ సునీల్ దివాన్‌జీని అదనపు డైరెక్టర్‌గా (నాన్–-ఎగ్జిక్యూటివ్, నాన్-–ఇండిపెండెంట్)గా నియమించింది. ఆయన నియామకం అక్టోబర్ 4, 2024 నుంచి అమలులోకి వచ్చింది. ఆయనకు వ్యాపార నిర్వహణలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
రిటైల్ బ్యాంకింగ్ సహా వివిధ విభాగాలలో దాదాపు 3 దశాబ్దాల పాటు కోటక్ గ్రూప్‌లో పనిచేశారు. కోటక్ గ్రూప్‌లో చేరడానికి ముందు ఏఎఫ్ ఫెర్గూసన్ లో మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ విభాగంలో 6 సంవత్సరాల పాటు సేవలు అందించారు.