పాట చిత్రీకరణలో విరాట్ కర్ణ నాగబంధం సినిమా..

పాట చిత్రీకరణలో విరాట్ కర్ణ నాగబంధం సినిమా..

‘పెదకాపు’ చిత్రంతో టాలీవుడ్‌‌కి పరిచయమైన విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ పిక్చర్స్, ఎన్‌‌ఐకే  స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌‌ నానక్‌‌ రామ్‌‌ గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.  హీరో విరాట్‌‌ కర్ణ, హీరోయిన్స్‌‌ నభా నటేష్‌‌, ఐశ్వర్య మీనన్‌‌పై ఓ గ్రాండ్‌‌ సాంగ్‌‌ని షూట్‌‌ చేస్తున్నారు. 

ఈ సాంగ్‌‌ కోసం ఓ భారీ సెట్‌‌ని నిర్మించారు.  మ్యూజిక్‌‌ డైరెక్టర్‌‌ అభే కంపోజ్‌‌ చేసిన ఈ పాటకు కాసర్ల శ్యామ్  లిరిక్స్ రాయగా,  కాలభైరవ, అనురాగ్‌‌ కులకర్ణి, మంగ్లీ పాడారు.  కొరియోగ్రాఫర్‌‌ గణేశ్‌‌ ఆచార్య మాస్టర్‌‌ డ్యాన్స్‌‌ మూమెంట్స్‌‌ ఇందులో స్పెషల్‌‌ ఎట్రాక్షన్‌‌గా ఉంటాయని మేకర్స్ చెప్పారు.