వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా నిలకడగా ఆడుతుంది. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా కోహ్లీ, రాహుల్ భారత్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి భారత్ ను పటిష్ట స్థితికి నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 4 ఫోర్లతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీకి ఇది 6 వ హాఫ్ సెంచరీ కాగా.. ఓవరాల్ గా 72 వది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటిలాగానే వేగంగా ఆది భారత్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే మరో మరో ఓపెనర్ గిల్(4), ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్(4) తక్కువ పరుగులకే ఔటయ్యారు. దీంతో భారత్ 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్, కోహ్లీ జోడీ ఆచితూచి ఆడుతూ భారత్ ను ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజ్ లో కోహ్లీ(50), రాహుల్ (28) క్రీజ్ లో ఉన్నారు.