
టీమిండియా స్టార్ ఆటగాడు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాడు. తన బ్యాటింగ్ తో.. ఆటిట్యూడ్ తో అందరి దృష్టిని విరాట్ తనపైన తిప్పుకుంటాడు. తాజాగా విరాట్ కోహ్లీ ఒక విషయంలో బాగా వైరల్ అవుతున్నాడు. అదేంటో కాదు విరాట్ కోహ్లీ పోలికలతో మరో వ్యక్తి ఉండడం విశేషం. వినడానికి ఆశ్చర్యరంగా ఉన్నా ఒక యాక్టర్ అచ్చు గుద్దినట్టు కోహ్లీని దింపేశాడు. అయితే అతను ఇండియన్ యాక్టర్ కాదు హాలీవుడ్ నటుడు కావడం విశేషం.
అతని పేరు కావిట్ సెటిన్ గునెర్. తుర్కియేలో నటుడిగా కెరీర్ కొనసాగిస్తున్న అతను నటుడు విరాట్ కోహ్లీకి అచ్చుగుద్దినట్టు ఉంటాడు. ప్రముఖ తుర్కియే సిరీస్ దిరిలిస్ లో కావిట్ సెటిన్ నటించాడు. ఇందులోని అతను గుర్రంపై వెళ్తున్న సీన్ ని స్క్రీన్‌షాట్ తీసి సోషల్‌మీడియాలో రెడిట్ యూజర్ ఒకరు పోస్టు చేశారు. అంతేకాదు అతను ‘అనుష్క శర్మ భర్త టీవీ షో అరంగేట్రం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్ అచ్చం కోహ్లీలా ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. శుక్రవారం (మార్చి 28) చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది.
Also Read: రాజస్థాన్‌పై డికాక్ హైలెట్ క్యాచ్
ఎర్తుగ్రుల్ తుర్కియే హిస్టారికల్ ఫిక్షన్, అడ్వెంచర్ సిరీస్. ఇందులో కావిట్ సెటిన్ కీలక పాత్రలో నటించారు. ఈ సిరీస్‌లో మొదటి సీజన్ 2014లో రిలీజ్ అయింది. అది విజయవంతం కావడంతో మరో నాలుగు సీజన్‌లు రూపొందించారు. 2019లో చివరి సీజన్ విడుదలైంది. నెట్‌ప్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కోహ్లీ పోలికలతో ఉన్న వ్యక్తులు కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పుడు అచ్చం కోహ్లీని పోలిన ఓ వ్యక్తి కనిపించాడు. ఇక పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ సైతం కోహ్లీ వలె ఉంటాడు.