ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లకు బాగా క్రేజ్ ఉంటుంది. వాటిలో కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఒకటి. ఆర్సీబీ తరపున కోహ్లీ.. కేకేఆర్ వైపు టీమిండియా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఉండడమే దీనికి కారణం. వీరిద్దరి గతంలో చాలా సార్లు మైదానంలో గొడవపడిన సంగతి తెలిసిందే. చివరి రెండు సీజన్ లు లక్నో జట్టు తరపున మెంటార్ గా వ్యవహరించిన గంభీర్.. ప్రస్తుత సీజన్ లో మళ్ళీ తన ఫేవరేట్ జట్టుకు వచ్చేశాడు.
ఐపీఎల్ లో భాగంగా నేడు (మార్చి 29) కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో అందరి దృష్టి కోహ్లీ, గంభీర్ పైనే ఉంది. ఇద్దరూ ఎంత అగ్రెస్సివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2023 సీజన్ లో లక్నో, బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్ లో కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మ్యాచ్ అయిపోయాక ఇరు జట్ల ఆటగాళ్ల షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలోనూ కోహ్లీ, నవీన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత కైల్ మేయర్స్, విరాట్ ఏదో మాట్లాడుతుండగా.. గంభీర్ వచ్చి మేయర్స్‌ను పక్కకు తీసుకెళ్లాడు.
Also Read: కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
ఈ సమయంలో గంభీర్ మళ్లీ ఏదో అనడంతో కోహ్లి, గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 2013 ఐపీఎల్ లో కోహ్లీ, గంభీర్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో గొడవ జరిగింది. నేడు మరోసారి ఈ రెండు జట్లు తలబడుతుండడంతో ఈ మ్యాచ్ పై ఆసక్తి పెరిపోయింది. బలాబలాలను చూస్తే కేకేఆర్ పటిష్టంగా కనిపిస్తుంది. ఎప్పటిలాగే గంభీర్, కోహ్లీ తమ దూకుడు కొనసాగిస్తారా.. లేకపోతే సైలెంట్ గా ఉంటారో చూడాలి.
Virat Kohli and Gautam Gambhir at the Chinnaswamy Stadium. 🥶 pic.twitter.com/hARFwFgmFM
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2024