జట్టులో స్టార్ ప్లేయర్స్.. అందరి కంటే సీనియర్ ప్లేయర్స్.. ప్రత్యర్థులను బెంబేలెత్తించగల డేంజర్ ప్లేయర్స్.. క్రీజ్ లో కుదురుకుంటే అలవోకగా సెంచరీలు బాదేయగల ప్లేయర్స్.. ఇదంతా టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి చెబుతున్న మాటలివి. 15 ఏళ్లుగా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ, చారిత్రాత్మక విజయాలను అందించిన ఈ ద్వయం బ్యాట్ ప్రస్తుతం మూగబోయింది. ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్ లో ఘోరంగా విఫలమవుతున్నారు. దీంతో వీరి ఫామ్ ఆందోళన కలిగిస్తుంది.
ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఏదైనా.. బౌలర్ ఎవరైనా రోహిత్, కోహ్లీ ఆధిపత్యం చూపించగలరు. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఈ ద్వయం చిన్న జట్లపై పరుగులు చేయలేక తంటాలు పడుతున్నారు. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క. లీగ్ మ్యాచ్ లు ఎలా ఆడినా భారత్ వరుస సాధించడంతో వీరి వైఫల్యాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే సూపర్ 8 లో వీరు ఫామ్ లోకి రాకపోతే జట్టు విజయంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ తో శనివారం (జూన్ 22) సూపర్ 8 లో భాగంగా రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ దాదాపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో తమ ఫామ్ ను రాబట్టుకునేందుకు కోహ్లీ, రోహిత్ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. గంటలకొద్దీ ప్రాక్టీస్ చేస్తూ కీలకమైన నేటి మ్యాచ్ లో మునుపటి ఫామ్ ను అందుకోవాలని చూస్తున్నారు. త్రో డౌన్ ప్రాక్టీస్ చేయడం.. నెట్స్‌లో వివిధ రకాల షాట్‌లను ప్రయత్నించడం లాంటివి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
పాకిస్తాన్‌పై రోహిత్, కోహ్లీ జోడించిన 12 రన్సే తొలి వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం. మిడిలార్డర్‌లో ఎవరో ఒకరు ఆదుకోవడం.. బౌలర్లు అద్భుత పెర్ఫామెన్స్ చేస్తుండటంతో ఇండియా ముందుకొస్తోంది. తొలి రౌండ్‌లో 1, 4, 0 స్కోర్లతో నిరాశ పరిచిన విరాట్ కోహ్లీ.. సూపర్ 8లో 24 బంతుల్లో 24 రన్స్ చేశాడు. ఈ ఫార్మాట్‌కు ఈ స్ట్రయిక్ రేట్ ఏమాత్రం సరిపోదు. రోహిత్ విషయానికి వస్తే ఐర్లాండ్‌పై ఫిఫ్టీ తర్వాత చివరి మూడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 13, 3, 8 స్కోర్లతో ఫెయిలయ్యాడు.
Virat Kohli and Rohit Sharma getting in a net session ahead of India's #T20WorldCup clash against Bangladesh 👀 pic.twitter.com/jA0NsM7rEb
— ICC (@ICC) June 22, 2024