ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు. 886 పాయింట్లతో బాబర్ మొదటి స్థానంలో ఉండగా, 777 పాయింట్లతో సౌతాఫ్రికా బ్యాటర్ రసీ వాండర్‌డస్సెన్ రెండో స్థానంలో ఉన్నారు. టాప్-10లో ఇద్దరు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. భారత యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్(724) ఏడవ స్థానంలో ఉండగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(712) తొమ్మిదవ స్థానంలో ఉన్నారు.
కూర్చున్నారు.. ర్యాంకులు పోయాయి
వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వలనే ఉద్దేశ్యంతో సీనియర్లిద్దరికీ విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలోనే వారి ర్యాంకులు పైకి ఎగబాకాయి. ఇంతకుముందు టాప్ -10లో ఉన్న హిట్‌మ్యాన్ 11వ స్థానానికి ఎగబాకగా, ఎనిమిదవ స్థానంలో ఉన్న కోహ్లీ 9వ ర్యాంకుకి పడిపోయారు.
దుమ్మురేపిన ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్
ఈ సిరీస్‌కు ముందు వరకూ జట్టులో స్థానం కోసం పోరాడిన ఇషాన్ కిషన్.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. తొలి వన్డేలో 52, రెండో వన్డేలో 55, చివరి వన్డేలో 77 పరుగులు చేసిన ఇషాన్.. మ్యాచ్ అఫ్ ది సిరీస్ సొంతం చేసుకోవటమే కాకుండా ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఇక బౌలింగ్‌లో దుమ్మురేపిన చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 8 స్థానాలు మెరుగుపర్చుకొని 14 ర్యాంకు సొంతం చేసుకున్నారు.
కాగా, విండీస్ పర్యటనలో టెస్ట్ సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకున్న టీమిండియా, వన్డే సిరీస్‌ను 2-1తేడాతో చేజిక్కించుకుంది. ఇక ఈ ఇరు జట్ల మధ్య గురువారం (ఆగస్ట్ 03) నుంచి 5 మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది.