టీ 20 అంతర్జాతీయ మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్

టీ 20 అంతర్జాతీయ మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్

దేశం మొత్తం టీ 20 వరల్డ్ కప్ గెలిచిన సంబరాల్లో ఉండగా.. విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశారు. ఇదే నా చివరి టీ 20 వరల్డ్ కప్ అని.. టీ 20 మ్యాచ్ లకు రిటైర్ మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇంటర్నేషనల్ టీ 20 క్రికెట్ మ్యాచ్ లకు సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు విరాట్ కోహ్లీ.

2007 తర్వాత టీమిండియాకు ఇది రెండో టీ20 వరల్డ్ కప్. 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి కప్ గెలిచింది ఇండియా జట్టు.

విరాట్ కోహ్లీ కొన్ని రోజులుగా పరుగుల చేయటానికి ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి కోహ్లీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో.. 76 పరుగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ కైవసం చేసుకున్నాడు. అంతే కాదు.. కోహ్లీ ఇన్ని పరుగులు చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు టీమిండియా ఈ కప్ గెలిచేదే కాదు అనేది వాస్తవం.

మ్యాచ్ గెలిచిన తర్వాత.. ఇది నా చివరి టీ20 వరల్డ్ కప్.. నేను ఏం సాధించాలని అనుకున్నానో ఆ కల నెరవేరింది అని ప్రకటించాడు విరాట్ కోహ్లీ..