టీమిండియా మాజీ సారథి 'విరాట్ కోహ్లీ' ఆటలోనే కాదు.. సంపాదనలోనూ అందరికంటే ముందున్నాడు. తాజాగా విరాట్ కోహ్లీ సంపాదనకు సంబందించిన వివరాలను ఓ మ్యాగ్‌జైన్ తన కవర్ పేజీమీద ప్రచురించింది. ఆ లెక్కల ప్రకారం కోహ్లీ నికర ఆదాయం రూ.1050 కోట్లుగా ఉంది.
రూ.80 కోట్ల విలువైన ఇల్లు
కోహ్లీ ప్రాపర్టీస్ విలువు రూ.110 కోట్లుగా మ్యాగ్‌జైన్ ప్రచురించింది. ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఇల్లు, గుర్గామ్‌లో రూ.80 కోట్ల విలువైన మరో ఇల్లు ఉన్నట్లు తెలిపింది. ఇక రన్ మెషిన్ వద్ద ఉన్న కార్ల విలువ రూ.30 కోట్ల పైమాటే. ఆడి, రేంజ్ రోవర్, ఫార్చూనర్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లున్నాయి.
ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు రూ.8.9 కోట్లు
కోహ్లీ తన ఇన్‌స్టా ఖాతాలో ఒక్క వ్యాపార ప్రకటనను షేర్ చేసేందుకు రూ.8.9 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. అదే ట్విటర్‌లో రూ. 2.5 కోట్లు తీసుకుంటున్నాడు.
బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7 కోట్ల
కోహ్లీకి క్రికెట్ పరంగా బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుతోంది. దీనికి అదనంగా మ్యాచ్ ఫీజుల రూపంలో ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు తీసుకుంటున్నాడు. ఇవి కాకుండా ఐపీఎల్‌లో ఆర్ సీబీ తరుపున ఆడుతున్నందకు రూ.15 కోట్ల వేతనం తీసుకుంటున్నాడు.
వ్యాపార ప్రకటనల ద్వారా రోజు రూ.7 నుంచి 10 కోట్లు
కోహ్లీ వ్యాపార ప్రకటనల ద్వారాఎక్కువ మొత్తం ఆర్జిస్తున్నాడు. రోజుకు రూ.7 నుంచి 10 కోట్లు వసూలు చేస్తున్నాడు. వివో, మింత్రా, గ్రేట్ లర్నింగ్, నాయిస్, వ్రాగన్, బ్లూస్టార్, టూయమ్మీ, ఓలిని, లక్సర్, హెచ్‌ఎస్‌బీసీ, ఊబర్, టూత్సీ, స్టార్ స్పోర్ట్స్, అమెరికన్ టూరిస్టర్, ఎమ్‌ఆర్‌ఎప్, సింథాల్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
పెట్టుబడులు..
కోహ్లీకి సొంతంగా రెండు రెస్టారెంట్స్(One 8, Nueva) ఉన్నాయి. ఇవి కాకుండా ఫుట్‌బాల్ క్లబ్, టెన్నిస్ టీమ్, ప్రో రెజ్లింగ్ లీగ్‌ల్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఎమ్‌పీఎల్, డిజిట్, కాన్వో, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, బ్లూట్రైబ్ వంటి కంపెనీల్లో కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు.
కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి SeVVA'అనే ఎన్‌జీవోను కూడా నడిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ పేరిట పేద విద్యార్థులు, క్రికెటర్లకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నాడు.
Virat Kohli:
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2023
Net Worth - 1,050cr.
Per post charge - 8.9cr on Instagram, 2.5cr on Twitter.
Properties - 110cr.
Cars - 31cr. pic.twitter.com/0zy9CWZlS3