విరాట్ కోహ్లీ 'పర్సనల్ ఎమర్జెన్సీ' ఎదర్కొన్నాడు. వస్తున్న సమాచారం ప్రకారం విరాట్ గౌహతి నుండి ముంబైకి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే కోహ్లీ ఉన్నపళంగా ముంబై వెళ్ళడానికి కారణం మాత్రం చెప్పలేదు. గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ దంపతులు బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో అనుష్క శర్మ కోసం కోహ్లీ ముంబై వెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా మిగిలిన భారత జట్టు మాత్రం రేపు జరగబోయే రెండవ వార్మప్ గేమ్ కోసం త్రివేండ్రం చేరుకున్నారు. కోహ్లి వార్మప్ గేమ్‌కు దూరమవుతాడో లేదో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఇంకా ధ్రువీకరించలేదు. దీంతో విరాట్ రేపు నెదర్లాండ్స్ తో వార్మప్ మ్యాచ్ కి జట్టులో చేరతాడా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ వార్మప్ గేమ్ ఆడకపోయినా.. ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ తొలి మ్యాచులో ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు.
ఇక వరల్డ్ కప్ వార్మప్ లో భాగంగా ఇప్పటికే ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఒక్క బాల్ కూడా పడలేదు. అక్టోబర్ 3న నెదర్లాండ్స్ తో జరగబోయే మ్యాచులో వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 8 న భారత్ ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ ఆడబోతుంది.