కాన్పూర్ టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్థానం మారింది. సాధారణంగా నాలుగో స్థానంలో ఆడాల్సిన కోహ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. విరాట్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే దీనికి కారణం లేకపోలేదు. వర్షం కారణంగా తొలి మూడు రోజుల ఆటలో కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మరో రెండో రోజులు ఆట మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఫలితం కోసం వేగంగా ఆడుతుంది. దీంతో వేగంగా ఆడగలిగే పంత్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో కోహ్లీ కంటే ముందుకు వచ్చాడు.
ALSO READ | IND vs BAN 2nd Test: జైశ్వాల్ విధ్వంసం.. భారత్ ఖాతాలో రెండు ప్రపంచ రికార్డులు
టీ విరామం తర్వాత శుభమాన్ గిల్ ఔట్ కావడంతో ఐదో స్థానంలో కోహ్లీ క్రీజ్ లోకి వచ్చాడు. చివరిసారిగా కోహ్లీ 2013లో వెస్టిండీస్ పై ముంబై టెస్టులో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. సచిన్ టెండూల్కర్ కు ఇది చివరి టెస్ట్ మ్యాచ్. ఈ 11 ఏళ్లలో నైట్ వాచ్‌మెన్ మినహాయిస్తే తొలిసారి కోహ్లీ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చాల్సి వచ్చింది. టెస్ట్ క్రికెట్ లో పేలవ ఫామ్ తో ఇబ్బందిపడుతున్న కోహ్లీ ఈ మ్యాచ్ తో భారీ ఇన్నింగ్స్ ఆడాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ మ్యాచ్ విషయానికి ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 22 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కోహ్లీ (24), రాహుల్ (14) క్రీజ్ లో ఉన్నారు. భారత్ మరో 49 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. 51 బంతుల్లోనే 72 పరుగులు చేసి జైశ్వాల్ టీ విరామానికి ముందు ఔటయ్యాడు. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు ఆలౌట్ అయింది.