IND vs BAN 2nd Test: విరాట్‌దే వరల్డ్ రికార్డ్.. 27000 పరుగుల క్లబ్‌లో కోహ్లీ

బంగ్లాదేశ్‌తో కాన్పూర్ లో జరుగుతున్న టెస్టులో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో వేగంగా 27000 పరుగులు సాధించిన రికార్డ్ ను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 25వ ఓవర్‌లో 35 పరుగుల వద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. ఓవరాల్ గా ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ తో పాటు కుమార సంగక్కర, రికీ పాంటింగ్‌లు ఈ జాబితాలో ఉన్నారు.

ALSO READ | IND vs BAN 2nd Test: ఐదో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్.. 11 ఏళ్ళ తర్వాత తొలిసారి

ఈ టెస్టు మ్యాచ్ లో టెస్టులో కోహ్లీ 47 పరుగులు చేసి ఔటయ్యాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు.. ఒక సిక్సర్ తో మంచి టచ్ లో కనిపించిన విరాట్ వేగంగా ఆడే క్రమంలో షకీబ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. దీంతో కనీసం అర్ధ సెంచరీ సాధిస్తాడనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ప్రస్తుతం భారత్ 30 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 51 బంతుల్లోనే 72 పరుగులు చేసి జైశ్వాల్ టీ విరామానికి ముందు ఔటయ్యాడు. కోహ్లీ (47), గిల్ (39) రాణించారు. ప్రస్తుతం భారత్ 15 పరుగుల ఆధిక్యంలో ఉంది.