IND vs BAN: రికార్డు పట్టేసిన రన్ మెషిన్.. వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో తొలి ఆటగాడు

IND vs BAN: రికార్డు పట్టేసిన రన్ మెషిన్.. వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో తొలి ఆటగాడు

ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌‌తో జరుగుతున్న సూపర్ -8 మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 37(28 బంతుల్లో) పరుగులు చేసిన కోహ్లీ.. టీ20, వన్డే ప్రపంచకప్‌ల చరిత్రలో 3000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 

ఈ మ్యాచ్‌కు ముందు  బ్యాటింగ్ మాస్ట్రోకు పరిమిత ఓవర్ల ప్రపంచకప్‌లలో 3000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 35 పరుగులు అవసరం కాగా, రెండు పరుగులే ఎక్కువే చేశాడు. ఈ జాబితాలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(2637) రెండో స్థానంలో ఉండగా.. మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్(2278) నాలుగో స్థానంలో ఉన్నారు. 

టీ20, వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు

  • 1. విరాట్ కోహ్లీ: 3000 పరుగులు
  • 2. రోహిత్ శర్మ : 2637 పరుగులు
  • 3. డేవిడ్ వార్నర్: 2502 పరుగులు
  • 4. సచిన్ టెండూల్కర్ : 2278 పరుగులు 
  • 5. కుమార్ సంగక్కర: 2193 పరుగులు