Cricket World Cup 2023: కింగ్ కొట్టేసాడు: సచిన్ ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ 

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన పరుగుల దాహాన్ని తీర్చుకునే పనిలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టి 15 సంవత్సరాలు దాటినా విరాట్ ఫామ్ ఇంకా అలాగే కొనసాగుతుంది. సచిన్ వారసుడిగా ఒక్కో రికార్డ్ బ్రేక్ చేస్తూ వస్తున్న కోహ్లీ.. తాజాగా క్రికెట్ గాడ్ సెట్ చేసిన ఒక ఆల్ టైం రికార్డ్ కింగ్ బ్రేక్ చేసాడు. 

వన్డేల్లో ఛేజింగ్ మాస్టర్ గా పేరున్న కోహ్లీ ఆ ట్యాగ్ కి న్యాయం చేస్తూ నిన్న ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచులో అదరగొట్టేసాడు. వరల్డ్ కప్ లో భాగంగా చెన్నైలో జరిగిన నిన్న మ్యాచులో 116 బంతుల్లో 85 పరుగులు చేసి భారత్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు.ఒక దశలో 2 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన భారత్ ని రాహుల్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఈ క్రమంలో వన్డే సక్సెస్ ఫుల్ ఛేజింగ్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. 

ALSO READ : పోలీసోళ్ల ముందే పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. పోడు భూముల లొల్లి

నిన్నటివరకు సచిన్ 5490 పరుగులతో టాప్ లో ఉండగా విరాట్ ఈ రికార్డ్ బ్రేక్ చేసాడు. మొత్తంగా కోహ్లీ 5517 పరుగులతో  ఎవ్వరికి అందనంత దూరంలో నిలిచాడు. కోహ్లీ, సచిన్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (4186), రోహిత్ శర్మ (3983) ఉన్నారు. టాప్-4 లో ఏకంగా ముగ్గురు భారత క్రికెటర్లు ఉండడం విశేషం.  ఇక వన్డేల్లో కోహ్లీ 47 సెంచరీలతో సచిన్(49) అత్యధిక సెంచరీల రికార్డ్ కి చేరువలో ఉన్న సంగతి తెలిసిందే. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)