T20 World Cup 2024 Final: నిస్వార్ధ దిగ్గజాలు: యువ క్రికెటర్ల కోసం కోహ్లీ, రోహిత్ వీడ్కోలు

T20 World Cup 2024 Final: నిస్వార్ధ దిగ్గజాలు: యువ క్రికెటర్ల కోసం కోహ్లీ, రోహిత్ వీడ్కోలు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ ఇద్దరు గత కొన్నేండ్లుగా టీమిండియాకు వెన్నెముకలా ఉన్నారు. లెక్కలేనన్ని రికార్డులు సృష్టించారు. వీరిద్దరిలో ఒకరు క్రీజ్ లో కుదురుకున్నా ప్రత్యర్థులకు చుక్కలు కనబడాల్సిందే. టాపార్డర్ లో వచ్చి తమ విధ్వంసకర ఆటతీరుతో  మ్యాచ్ ను దాదాపు పూర్తి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకేసారి టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. వీరి నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

దేశం మొత్తం టీ 20 వరల్డ్ కప్ గెలిచిన సంబరాల్లో ఉండగా.. విరాట్ కోహ్లీ ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్ అని.. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ మ్యాచ్ లకు సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. విరాట్ కోహ్లీ కొన్ని రోజులుగా పరుగుల చేయటానికి ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి కోహ్లీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడానికే కోహ్లీ  తప్పుకున్నట్టు వెల్లడించాడు. 

మరోవైపు రోహీహ్ శర్మ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఇంటర్వ్యూలో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌ కు గుడ్ బై చెప్పాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని తెలిపాడు. యంగ్ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే వెనక్కి తగ్గుతున్నట్లు తెలిపారు. ఈ టోర్నీలో 8 మ్యాచ్ ల్లో హిట్ మ్యాన్ 257 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు. సూపర్ 8 లో ఆస్ట్రేలియాపై.. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై సాధించిన హాఫ్ సెంచరీలు హైలెట్ గా నిలిచాయి. 

ఈ ఇద్దరు దిగ్గజాలు ఫామ్ లో ఉన్నప్పటికీ భవిష్యత్తు క్రికెటర్లను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆడాలనే కసి ఇంకా తమలో ఉన్నా యువ క్రికెటర్ల కోసం వేరు ఆలోచించిన తీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఇద్దరి కలయికలో వరల్డ్ కప్ రావడం ఇదే తొలిసారి. 2014 టీ20 కలిసి ఆడుతున్న రోహిత్, కోహ్లీ ఐసీసీ టోర్నీల్లో విజయం దిశగా తీసుకెళ్లినా ట్రోఫీ తీసుకురాలేకపోయారు. ఈ క్రమంలో 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2015, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్, 2022, 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ .. 2021, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో టీమిండియా చివరి వరకు వచ్చి ఓడిపోయింది. అయితే ఎట్టకేలకు 2024 టీ20 వరల్డ్ కప్ అందించి ఘనమైన వీడ్కోలు పలికారు.