వరల్డ్ కప్ లో కోహ్లీ కొత్త అవతారమెత్తాడు. బౌలింగ్ లో వేస్తూ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసాడు. అంతేకాదు వికెట్ తీసి తనలో ఒక బౌలర్ ఉన్నాడని నిరూపించాడు. ఈ వరల్డ్ కప్ లో ఆరో బౌలర్ కోసం చేసే ప్రయత్నంలో కోహ్లీ అదరగొట్టాడు. ఏకంగా ఫామ్ లో ఉన్న నెదర్లాండ్స్ కెప్టెన్ వికెట్ పడగొట్టాడు. కోహ్లీ వికెట్ తీయడంతో స్టేడియం అంతా హోరెత్తింది.
మొదట బ్యాటింగ్ లో 51 పరుగులు చేసి రాణించిన కోహ్లీ.. బౌలింగ్ లోనూ ఒక కీలక వికెట్ సంపాదించాడు. తన తొలి ఓవర్ లో 7 పరుగులు ఇచ్చిన కోహ్లీ.. రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 25) మూడో బంతిని బ్యాటర్ కు దూరంగా విసిరాడు. వైడ్ వెళ్తున్న బంతిని కదిలించుకున్న ఎడ్వార్డ్స్ కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక విరాట్ వికెట్ తీయడంతో అతని సతీమణి అనుష్క శర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లేచి చప్పట్లు కొడుతూ సంతోషంతో కేరింతలు కొట్టింది.
411 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ప్రస్తుతం 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. సిరాజ్ రెండు వికెట్లు తీసుకోగా, బుమ్రా, కుల్దీప్ యాదవ్, జడేజా, కోహ్లీ కి ఒక వికెట్ దక్కింది. క్రీజ్ లో తేజ నిడమానూరు(28), వాన్ బీక్ (7) ఉన్నారు.
Wicket for Virat Kohli in World Cup 2023 at Chinnaswamy...??#INDvNED #INDvsNED #IndiaVsNetherlands #RohitSharma #ShreyasIyer #KLRahul #ViratKohli #anushkasharma #ODIWorldCup #CWC23 | Wicket | Gill | RCB RCB | Anushka | Scott Edwards | S. Gangulypic.twitter.com/GAbGDTSxgC
— Shailendra Singh (@ShailendraS97) November 12, 2023