IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్‌కు వెళ్లిన కోహ్లీ

బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆటలో భాగంగా విరాట్ కోహ్లీకి దురదృష్టం వెంటాడింది. అతను నాటౌట్ అయినా అంపైర్ తప్పిదంతో పెవిలియన్ కు చేరాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్ డిఫెన్స్ చేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. ఈ బంతి అతని ఫ్రంట్ ప్యాడ్‌కి క్రాష్ అయింది. దీంతో బంగ్లా అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. ఈ సమయంలో కోహ్లీ డీఆర్ఎస్ ఉన్నప్పటికీ తీసుకోకపోవడం అతని కొంప ముంచింది. 

నాన్ స్ట్రైకింగ్ లో శుభ్‌మాన్ గిల్ తో కాసేపు చర్చించి రివ్యూ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. అయితే రీప్లేలో బాల్ స్పష్టంగా బ్యాట్ ఎడ్జ్ అయినట్టు కనిపించింది. ఇది చూసిన రోహిత్ తీవ్ర అసంతృప్తితో కనిపించాడు. మరోవైపు కోహ్లీ ఫ్యాన్స్  నాన్ స్ట్రైకింగ్ లో శుభ్‌మాన్ గిల్ కోహ్లీకి రివ్యూ తీసుకోమని చెప్పి ఉండాల్సింది అని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read :- రోహిత్, కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యంతో పట్టు బిగించిన భారత్

కోహ్లీ గతంలోనూ డీఆర్ఎస్ విషయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ 17 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లోనూ 6 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. 2024 లో ఫామ్ లేక ఇబ్బందిపడుతున్న కోహ్లీకి ఇలా దురదృష్టం తోడవ్వడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రెండో టెస్టులో భారీ స్కోర్ చేసి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ తో పాటు దేశమంతా కోరుకుంటుంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో భారత్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 306 పరుగులకు చేరింది. క్రీజ్ లో గిల్ (33), పంత్ (12) ఉన్నారు.భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.