గువాహటి వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. శుభ్మన్ గిల్ ఔట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ 80 బంతులను ఎదురుకుని సెంచరీ సాధించాడు, వన్డేల్లో కోహ్లీకి ఇది 45 వ సెంచరీ కాగా శ్రీలంక పై తొమ్మిదో సెంచరీ కావడం విశేషం.
సచిన్ రికార్టు బ్రేక్
ఈ సెంచరీతో భారత మాజీ ఆటగాడు సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. సచిన్ తన వన్డే ఫార్మాట్‌లో శ్రీలంకపై 8 సెంచరీలు చేయగా, కోహ్లీ తాజాగా లంకపై తొమ్మిదో సెంచరీ చేసి సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు.
సచిన్ తో సమంగా..
ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేసి సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును సమం చేశాడు. స్వదేశంలో సచిన్ 20 సెంచరీలు సాధించగా తాజా సెంచరీతో విరాట్ సచిన్ తో సమంగా నిలిచాడు.