Virat Kohli: 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతా.. టైటిల్ గెలవడమే లక్ష్యం.. కన్ఫర్మ్ చేసిన కోహ్లీ!

Virat Kohli: 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతా.. టైటిల్ గెలవడమే లక్ష్యం.. కన్ఫర్మ్ చేసిన కోహ్లీ!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతానని స్పష్టం చేశాడు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ కు ముందు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో విరాట్.. వరల్డ్ కప్ ఆడతానని తెలిపాడు. ఈ కార్యక్రమంలో భాగంగా హోస్ట్ ప్రశ్నిస్తూ మీ నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటి అని అడిగారు. దానికి కోహ్లీ స్పందిస్తూ..  "తదుపరి బిగ్ స్టెప్ గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ వరల్డ్ కప్ గెలవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం". అని కోహ్లీ అన్నాడు. దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

వన్డే ప్రపంచ కప్ 2027 లో జరుగుతుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై ఊహాగానాలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని కోహ్లీ స్పష్టం చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో సొంతగడ్డపై ఇండియా.. ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. ఈ టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన విరాట్.. 761 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. 

ALSO READ : 19 ఏండ్ల కుర్రాడి చేతిలో జొకోవిచ్‌‌‌‌ ఓటమి.. మియామి ఓపెన్ టైటిల్ నెగ్గిన జాకబ్ మెన్సిక్

ప్రస్తుతం కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. చెన్నై సూపర్ కింగ్స్ పై 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఐపీఎల్ తర్వాత జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తలపడాల్సి ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు.