
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఫీల్డర్‌గా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ రికార్డు బద్దలు కొట్టాడు.
ALSO READ | IND vs PAK: బ్యాటింగ్‌లో తడబడిన పాకిస్థాన్.. టీమిండియా ముందు డీసెంట్ టార్గెట్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాది జట్టు పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. నసీం షా క్యాచ్‌ను అందుకోవడం ద్వారా కోహ్లీ 157వ క్యాచ్ పూర్తి చేశాడు. గతంలో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 334 వన్డేల్లో 156 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. ఆ రికార్డును కోహ్లీ ఇప్పుడు చెరిపేశారు.
వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు.. భారత ఫీల్డర్లు
- విరాట్ కోహ్లీ: 157
- మహ్మద్ అజారుద్దీన్: 156
- సచిన్ టెండూల్కర్: 140
- రాహుల్ ద్రవిడ్: 124
- సురేశ్ రైనా: 102
అంతర్జాతీయ క్రికెట్‌లో..
- మహేల జయవర్ధనే: 218 క్యాచ్‌లు
- రికీ పాంటింగ్: 160 క్యాచ్‌లు
VIRAT KOHLI NOW HAS THE MOST CATCHES BY AN INDIAN FIELDER IN ODIs.
— Kausthub Gudipati (@kaustats) February 23, 2025
157 - Virat Kohli
156 - Mohammad Azharuddin
140 - Sachin Tendulkar
124 - Rahul Dravid
102 - Suresh Raina#INDvPAK #ChampionsTrophyonJioStar pic.twitter.com/19BsHJueBS