
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. 50 ఓవర్ల ఫార్మాట్ లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ రికార్డు సమం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
Also Read :- 5 వికెట్లతో చెలరేగిన షమీ.. హృదయ్ సెంచరీతో బంగ్లాదేశ్ డీసెంట్ టోటల్
జాకీర్ అలీ క్యాచ్‌ను అందుకోవడం ద్వారా కోహ్లీ 156వ క్యాచ్ పూర్తి చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కూడా ఇదే సంఖ్యలో క్యాచ్‌లు అందుకున్నాడు. మాజీ కెప్టెన్ 334 వన్డేల్లో 156 క్యాచ్‌లు పూర్తి చేయగా.. కోహ్లీ 298 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు ఉన్నారు.
వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు.. భారత ఫీల్డర్లు
- మహ్మద్ అజారుద్దీన్: 156 క్యాచ్‌లు
- విరాట్ కోహ్లీ: 156 క్యాచ్‌లు
- సచిన్ టెండూల్కర్: 140 క్యాచ్‌లు
- రాహుల్ ద్రవిడ్: 124 క్యాచ్‌లు
- సురేశ్ రైనా: 102 క్యాచ్‌లు
అంతర్జాతీయ క్రికెట్‌లో..
- మహేల జయవర్ధనే: 218 క్యాచ్‌లు
- రికీ పాంటింగ్: 160 క్యాచ్‌లు