CSK vs RCB: 17 ఏళ్ళ తర్వాత చెపాక్‌లో విజయం.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ అదిరిపోయే స్టెప్పులు

CSK vs RCB: 17 ఏళ్ళ తర్వాత చెపాక్‌లో విజయం.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ అదిరిపోయే స్టెప్పులు

ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హవా కొనసాగుతుంది. తొలి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను వారి సొంతగడ్డపైనే చిత్తు చేసిన ఆర్సీబీ.. శుక్రవారం (మార్చి 28) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెపాక్ లో జయభేరి మోగించింది. 17 ఏళ్ళ తర్వాత చెపాక్ లో బెంగళూరు జట్టు విజయం సాధించడం విశేషం. చివరిసారిగా 2008 లో ద్రావిడ్ కెప్టెన్సీలో చెన్నైలో ఆర్సీబీ నెగ్గింది. 

Also Read :- స్పిన్ ఆడడంలో అతడిని మించినోడు లేడు

ఆ తర్వాత 17 ఏళ్లలో ఆ జట్టుకు చెన్నై గడ్డపై పరాజయాలే పలకరించాయి. అయితే ఎట్టకేలకు రజత్ పటిదార్ కెప్టెన్సీలో బెంగళూరు నెగ్గింది. ఈ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో బెంగళూరు జట్టు సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో సాగాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ హైలెట్ గా మారుతుంది. రన్ ఇట్ అప్ అనే పాటకు తనదైన శైలిలో స్టెప్పులు వేశాడు. కోహ్లీ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. పతిరానా బౌలింగ్ లో వెంటవెంటనే సిక్సర్, ఫోర్ కొట్టి సత్తా చాటాడు. 

శుక్రవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఆర్‌‌సీబీ 50 రన్స్‌‌ తేడాతో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌కు చెక్‌‌ పెట్టింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 196/7 స్కోరు చేసింది. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 146/8 స్కోరుకే పరిమితమైంది. దీంతో ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయాలు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 పాయింట్లతో టాప్ లో ఉంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 2 న గుజరాత్ టైటాన్స్ పై ఆడుతుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.