
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు. 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో పోటీ పడే ఢిల్లీ రంజీ జట్టులో విరాట్ కోహ్లీ పేరును డీడీసీఏ సోమవారం (జనవరి 27) అధికారికంగా చేర్చింది. దీంతో అందరి కళ్ళు విరాట్ కోహ్లీపైనే ఉంది. కోహ్లీ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనుండడంతో అతన్ని కెప్టెన్సీ చేయాల్సిందిగా ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అతన్ని కోరింది. అయితే కోహ్లీ మాత్రం తనకు వద్దని.. తాను ప్లేయర్ గానే జట్టులో కొనసాగుతానని సూచించాడు.
ఈ మ్యాచ్ కోసం కోహ్లీ మంగళవారం నుంచి అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నాడు. విరాట్ కోహ్లీని చూసేందుకు స్థానిక అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం స్టేడియంలోని మూడు స్టాండ్లలో అభిమానులను అనుమతిస్తున్నట్టు డీడీసీఏ తెలిపింది. కోహ్లీ బరిలోకి దిగుతున్నప్పటికీ మ్యాచ్‌ను బీసీసీఐ లైవ్ టెలికాస్ట్ చేయడం లేదు. కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.
కోహ్లీ రీ ఎంట్రీ మ్యాచ్ కు సీటింగ్ కెపాసిటీ పెంచడమే కాకుండా 10,000 మంది అభిమానులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించింది. దీనికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. 2012 లో విరాట్ కోహ్లీ చివరిసారిగా ఉత్తరప్రదేశ్ పై రంజీ ట్రోఫీ ఆడాడు. ఆ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 14 పరుగులు చేసి విఫలమైన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్ లో 43 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ కఠిన సవాలుకు ముందు కోహ్లీ దేశవాళీ క్రికెట్ లో ఆడి ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి హెడ్డింగ్లీలోని లీడ్స్‌లో ప్రారంభమవుతుంది. కోహ్లీ ఫామ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఘోరంగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. విరాట్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తే అతని టెస్ట్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తుంది.
🚨 KING KOHLI DECLINE DELHI'S CAPTAINCY 🚨
— Johns. (@CricCrazyJohns) January 28, 2025
- DDCA approached Virat Kohli to lead the Delhi team but he declined like Rishabh Pant did as youngster Ayush Badoni will continue to lead. [Arani Basu from TOI] pic.twitter.com/YV3d0m05gO