Virat Kohli : ఔటయ్యాక సిడ్నీలో కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్.. కారణమేంటంటే..?

Virat Kohli : ఔటయ్యాక సిడ్నీలో కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్.. కారణమేంటంటే..?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమవుతున్న సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ మినహాయిస్తే మిగిలిన ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. దీంతో కోహ్లీపై దిగ్గజాలు విమర్శలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులోనూ కోహ్లీ రెండు ఇన్నింగ్స్ ల్లో సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరాడు. చివరిదైన ఐదో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా శనివారం (జనవరి 4) కోహ్లీ 6 పరుగులకే కింగ్ ఔటయ్యాడు.  

కోహ్లీ ఔట్ అయ్యి డగౌట్ కి వెళ్తున్న సమయంలో అతనికి ఆస్ట్రేలియా అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అభిమానులు కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడంలో కారణం లేకపోలేదు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ దాదాపు చివరి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడేశాడు. ఎందుకంటే భారత్ 2028 లో ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. అప్పటిలోపు కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరో నాలుగేళ్లపాటు విరాట్ టెస్టుల్లో కొనసాగడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే అతనికి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. 

ALSO READ | IND vs AUS: స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్.. సహనం కోల్పోయిన కోహ్లీ

టెస్టుల్లో కోహ్లీకి ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డ్ ఉంది. 2014-15 ఆసీస్ పర్యటనలో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాలో అతని ఫ్యాన్ బేస్ కూడా ఓ రేంజ్ లో ఉంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా మీడియా విరాట్ కోహ్లీని తెగ హైలెట్ చేసింది. అక్కడ వార్తా పత్రికలపై కోహ్లీని పొగడ్తలతో ముంచేసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ప్రముఖ న్యూస్ పేపర్ 'ది డైలీ టెలిగ్రాఫ్‌'లో కోహ్లీ ఫొటోను ఫ్రంట్ కవర్‌ పేజీపై ప్రచురించింది. ఈ మ్యాగజిన్ లో కోహ్లీ క్రికెట్ లో సాధించిన ఘనతలు గురించి రాసుకొచ్చింది. కోహ్లీ సాధించిన రికార్డుల గురించి ఈ మ్యాగజిన్ లో రాయడం విశేషం.