కోహ్లీ గొప్ప క్రికెటర్..బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు

విరాట్ కోహ్లీ తాను కెప్టెన్సీని వదులుకోలేదని.. బలవంతంగా తొలగించారని ఆరోపించాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. అతనో గొప్ప క్రికెటర్ అని కొనియాడారు. ఈ వివాదం నుంచి విరాట్ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడని తెలిపాడు షోయబ్ అక్తర్ .ఇటీవల వన్డే,టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు.  సౌతాఫ్రికా టెస్టు సిరీస్ తో ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు కోహ్లీ. ప్రస్తుతం ఒక ప్లేయర్ గానే తన పని తాను చేసుకుంటున్నాడు తప్ప..జట్టులో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు కోహ్లీ. మైదానంలో ఆటగాళ్లలో జోష్ కనిపించడం లేదు. కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు మైదానంలో అగ్రెసివ్ గా కనిపించే వాడు. మిగతా ప్లేయర్లు కూడా హుషారుగా కనిపించే వారు