
పేలవ ఫామ్ తో రంజీ ట్రోఫీ ఆడుతున్న కోహ్లీ ఇక్కడ కూడా నిరాశపరిచాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో రోజు యష్ ధుల్ ఔటైన తర్వాత నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కోహ్లీ.. ఒక ఫోర్ కొట్టి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కోహ్లీ బ్యాటింగ్ దిగడంతో గ్రౌండ్ లో హంగామా చేసిన ఫ్యాన్స్.. ఫోర్ కొట్టడంతో గ్రౌండ్ అంతా మారుమ్రోగిపోయింది. అయితే ఆ కాసేపటికే అభిమానులను నిరాశకు గురి చేశాడు. హిమాన్షు సాంగ్వాన్ వేసిన ఒక అద్భుత ఇన్ స్విన్గర్ ని డ్రైవ్ చేయాలని భావించిన కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు.
స్టంప్ మూడు స్టంప్ ఎగురుకుంటూ వెనకపడింది. ఈ అద్భుతమైన బంతికి కోహ్లీ సైతం షాక్ కు గురయ్యాడు. నిరాశగా పెవిలియన్ కు చేరాడు. కోహ్లీ ఔటైన తర్వాత గ్రౌండ్ ఒక్కసారిగా మూగబోయింది. కోహ్లీ బ్యాటింగ్ దిగే సమయంలో జియో సినిమా వ్యూయర్ షిప్ ఏకంగా కోటికి చేరడం విశేషం. ఒక రంజీ ట్రోఫీకి మ్యాచ్ కు ఇదే హైయెస్ట్ రికార్డ్ వ్యూయర్ షిప్ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ బరిలోకి దిగడంతో 27 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కెప్టెన్ బదోని (24), సుమిత్ (13) క్రీజ్ లో ఉన్నారు. విరాట్ కోహ్లీ ఆరు పరుగులకు ఔటయ్యాడు. ప్రస్తుతం 116 పరుగులు వెనకబడి ఉంది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో రైల్వేస్ 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఉపేంద్ర యాదవ్ 95 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Harish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli? | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb
— ?????? ?? (@LegendDhonii) January 31, 2025