Virat Kohli: వివాదానికి పుల్ స్టాప్.. ఔటైన బంతిపై కోహ్లీ ఆటో గ్రాఫ్

Virat Kohli: వివాదానికి పుల్ స్టాప్.. ఔటైన బంతిపై కోహ్లీ ఆటో గ్రాఫ్

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవలే జరిగిన రంజీ ట్రోఫీలో విఫలమైన సంగతి తెలిసిందే. 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీలో రీ ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. కేవలం ఆరు పరుగులే చేసి నిరాశ పరిచాడు.  కోహ్లీ బ్యాటింగ్ దిగడంతో గ్రౌండ్ లో హంగామా చేసిన ఫ్యాన్స్.. ఫోర్ కొట్టడంతో గ్రౌండ్ అంతా మారుమ్రోగిపోయింది. అయితే ఆ కాసేపటికే అభిమానులను నిరాశకు గురి చేశాడు. హిమాన్షు సాంగ్వాన్ వేసిన ఒక అద్భుత ఇన్ స్విన్గర్ ని డ్రైవ్ చేయాలని భావించిన కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు. 

కోహ్లీ ఔట్ తర్వాత హిమాన్షు సాంగ్వాన్ చేసుకున్న సెలెబ్రేషన్స్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. అసలే ఫ్యాన్స్ కోహ్లీ విఫలమయ్యాడనే బాధలో ఉంటే సాంగ్వాన్ ఓవరాక్షన్ విరాట్ అభిమానులకు కోపం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు అతన్ని విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా హిమాన్షు సాంగ్వాన్ కోహ్లీ దగ్గరకు వెళ్లి బంతిపై ఆటోగ్రాఫ్ ఇవ్వమని అడిగాడు. అది కోహ్లీని ఔట్ చేసిన బంతి కావడం విశేషం. కోహ్లీ కూడా సాంగ్వాన్ కోరికను తీర్చాడు. బంతిపై సంతకం చేసి దానిని హిమాన్షు సాంగ్వాన్ కు అందజేశాడు. దీంతో ఫ్యాన్స్ సాంగ్వాన్ ను ట్రోల్ చేయడం ఆపేయడం ఖాయం.

ALSO READ | Womens U19 T20 World Cup: అమ్మ, నాన్న నన్ను క్షమించండి: సౌతాఫ్రికా కెప్టెన్ ఎమోషనల్

తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి బౌల్డ్ చేసిన బంతి తన కెరీర్ లో అత్యంత ముఖ్యమైనదని సాంగ్వాన్ అన్నాడు. గురువారం (జనవరి 30) సూరజ్ అహుజా రైల్వేస్‌తో ప్రారంభమైన మ్యాచ్‌ ద్వారా 12 ఏళ్ళ తర్వాత విరాట్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగడంతో అతని క్రేజ్ ఆకాశాన్ని దాటేసింది. ఉదయం నాలుగు గంటల నుంచే ఫ్యాన్స్ స్టేడియంలోకి రావడానికి క్యూ కట్టారు. తొలి రోజు కోహ్లీ బ్యాటింగ్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. రెండో రోజు బ్యాటింగ్ దిగినా ఆరు పరుగులకే ఔటయ్యాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ తేడాతో రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.