
ఆదివారం (ఏప్రిల్ 13) రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈజీ క్యాచ్ మిస్ చేశాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్ చివరి బంతికి ఈ సంఘటన చోటు చేసుకుంది. సుయాష్ శర్మ వేసిన 17 ఓవర్ చివరి బంతిని ధృవ్ జురెల్ లాంగ్-ఆఫ్ లో భారీ షాట్ కొట్టాడు. టైమింగ్ సరిగా కుదరకపోవడంతో.. ఈ క్యాచ్ నేరుగా కోహ్లీ చేతుల్లోకి వెళ్ళింది. అయితే ఈ ఈజీ క్యాచ్ ను కోహ్లీ జారవిడిచారు. చేతుల్లోకి వచ్చిన ఈ క్యాచ్ మిస్ చేయడం ఆర్సీబీకి కొంత మైనస్ అనే చెప్పాలి.
కోహ్లీ క్యాచ్ మిస్ చేసినప్పుడు జురెల్ 11 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రాజస్థాన్ వికెట్ కీపర్ ఆ తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్ గా 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. కోహ్లీ గనుక క్యాచ్ పట్టి ఉంటే రాజస్థాన్ కనీసం 10 పరుగులైనా తక్కువ చేయగలిగేది. క్యాచ్ లు జారవిడవడం సహజం. కానీ కోహ్లీ మిస్ చేసిన ఈ క్యాచ్ బెంగళూరు విజయావకాశాలపై ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
Suyash Sharma is disappointed with Virat Kohli as he dropped a Simple Catch.
— Radha (@Radha4565) April 13, 2025
Age is Catching up Virat Kohli,even your teammates are not respecting you😞#RRvRCB pic.twitter.com/7BZLg5VWu3
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల డీసెంట్ టోటల్ చేయగలిగింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (47 బంతుల్లో 75:10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడి హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, హేజల్ వుడ్, కృనాల్ పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.