మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడనే విషయంపై గత కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. భారత క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఐపీఎల్ లో కొనసాగుతూనే ఉన్నాడు. 42 ఏళ్ళ వయసులో కూడా తన ఫిట్ నెస్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే వస్తున్న నివేదికల ప్రకారం ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని తెలుస్తుంది. క్రికెట్ లవర్ నుంచి ఎక్స్ పర్ట్స్ వరకు ఇదే విషయాన్ని బల్లగుద్ది చెబుతున్నారు.
కెప్టెన్సీని గుడ్ బై చెప్పడం.. మోకాలి గాయం.. వచ్చే ఏడాది మెగా ఆక్షన్ ఉండడం లాంటి అంశాలు మహేంద్రుడి రిటైర్మెంట్ పై మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. దీనికి తోడు తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇరు జట్లు ఉన్న ఒక్క ప్లే ఆఫ్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది.
ఈ మ్యాచ్ కు ముందు జియో సినిమాతో మాట్లాడిన కోహ్లీ ధోనీతో ఇది తనకు చివరి మ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. "మహీ భాయ్, నేను బహుశా చివరిసారిగా ఆడబోయే మ్యాచ్ ఇదే కావొచ్చు. అభిమానులకు ఇది గొప్ప క్షణం అవుతుంది. కొన్నేళ్లుగా మేమిద్దరం భారత జట్టుకు ఎన్నో గొప్ప భాగస్వామ్యాలను అందించాము. ధోనీ ఎన్ని మ్యాచ్ లు ఫినిష్ చేసాడో మనందరికీ తెలుసు". అని జియో సినిమా ఇన్‌సైడ్ అవుట్ షోలో కోహ్లీ చెప్పాడు. మరి కోహ్లీ చెప్పినట్టు ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందో లేదో చూడాలి.
Virat Kohli drops big hint on MS Dhoni's retirement ahead of RCB-CSK clash#RCBvsCSK #CSKvsRCB #viratkohli #mahirat pic.twitter.com/cJ2NQWbEns
— SportsTiger (@The_SportsTiger) May 18, 2024