టెస్ట్ మ్యాచ్ లో ఒడిపోవడంతో విరాట్ కోహ్లీ ఏడ్చేశాడు: వరుణ్ ధావన్

టెస్ట్ మ్యాచ్ లో ఒడిపోవడంతో విరాట్ కోహ్లీ ఏడ్చేశాడు: వరుణ్ ధావన్

ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి దాదాపుగా తెలియనివారుండరు. రన్ మెషిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ అన్ని ఫార్మాట్స్ లో రికార్డులు క్రియేట్ చేశాడు. అయిత్ గ్రౌండ్ లో దూకుడుగా ఉంటూ తనని కవ్వించిన వాళ్ళకి మాటలతోపాటు బ్యాట్ తో సమాధానం చెప్పిన సంఘటనలు కోకొల్లలు. దీంతో ఎంతోమంది విరాట్ ఆటకి మాత్రమే కాదు... యాటిట్యూడ్ కి కూడా పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. 

ఐతే విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ గురించి ప్రముఖ హీరో వరుణ్ ధావన్ ఆసక్తికర విషయాలు ఆడియన్స్ తో పంచుకున్నాడు. ఈ క్రమంలో 2018లో నాటింగ్‌హామ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో భారత్ ఓడిపోయిందని కానీ ఈ టెస్ట్ లో విరాట్ టాప్ స్కోరర్ గా నిలిచి గెలుపు కోసం పోరాటం చేశాడు. అయినప్పటికీ ఓడిపోవడంతో గదిలోకి వెళ్లి ఏడ్చేశాడని దీంతో అనుష్క శర్మ విరాట్ ని ఓదార్చిందని తెలిపాడు. అయితే విరాట్ లైఫ్ లోకి  అనుష్క వచ్చిన తర్వాత చాల మార్పులు వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

అనుష్క శర్మ తనకి మంచి ఫ్రెండ్ అని దాంతో తమ మధ్య లైఫ్ కి సంబందించిన కాన్వర్సేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇక అనుష్క శర్మ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఆమె ముక్కుసూటిగా ఉంటుందని, అన్యాయాన్ని అస్సలు సహించబోదని తెలిపాడు. తన కళ్లెదుట తప్పు జరుగుతుంటే అస్సలు ఊరుకోదని తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా వరుణ్ ధావన్ ప్రముఖ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన బేబీ జాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో వరుణ్ కి జంటగా కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా డిసెంబర్ 25న ఆవరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.