టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆటలో ఎంత శ్రద్ధ చూపిస్తాడో ఫిట్ నెస్ పరంగా అంతే జాగ్రత్తగా ఉంటాడు. ప్రపంచ క్రికెటర్లలో ఫిట్ నెస్ కు కొత్త నిర్వచనాన్ని సెట్ చేసిన విరాట్..ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. శరీరం ఫిట్ గా ఉండడానికి ప్రధానంగా వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. తన ఫిట్ నెస్ కు మాంసాహారం అడ్డుకాకూడదని శాఖాహారిగా మారిపోయాడు. అయితే తాజాగా కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పిక్ అర్ధం చేసుకోలేక తలలు పట్టుకుంటున్నారు.
కోహ్లీ కొన్నేళ్ల క్రితం శాకాహారిగా మారిపోయాడు. ఇంతకుముందు తన అనేక ఇంటర్వ్యూలలో తాను శాఖాహారిగా మారినట్లు ఈ పరుగుల వీరుడు చెప్పుకొచ్చాడు. వెన్నెముక సమస్య కారణంగా తాను మాంసాహారాన్ని విడిచిపెట్టినట్లు విరాట్ గతంలో వెల్లడించాడు. అతని శరీరం చాలా యూరిక్ యాసిడ్‌ను సృష్టిస్తున్నందున..విరాట్ తన ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే, విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'మాక్ చికెన్ టిక్కా' అని ఒక కథనాన్ని పోస్ట్ చేయడంతో, చాలా మంది అభిమానులు షాక్ అవుతున్నారు.
విరాట్ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'మాక్ చికెన్ టిక్కా' తింటున్నాడు. అయితే ఇది మాంసాహారం కాదు. మొక్కల ఆధారితంగా వచ్చిన సోయా నుంచి ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఇది చూడడానికి మాంసాహారంలా కనిపించినా ఇదొక పూర్తి శాఖాహార వంటకం. రుచిపరంగా ఇది అచ్చం చికెన్ లా ఉంటుంది. సాధారణ చికెన్ కు, మాక్ చికెన్ టిక్కా తేడా గుర్తించడంలో విఫలమైన ఫ్యాన్స్ ఏంటి కోహ్లీ చికెన్ తింటున్నాడని ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా టీ20లు వన్డేల నుంచి రెస్ట్ తీసుకున్న కోహ్లీ.. టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో టోర్నీ అంతటా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి 765 పరుగులు చేసిన కోహ్లీ.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. ఈ మెగా టోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టీ20 లు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
Some people on Twitter really don't understand the difference between Chicken tikka and Mock chicken tikka (a kinda plant food)
— Akshat (@AkshatOM10) December 12, 2023
and started controversy against Virat Kohli for eating non veg. ?? pic.twitter.com/rplyX4QPmq