IND vs BAN 2024: బంగ్లాతో రెండో టెస్ట్.. సచిన్, బ్రాడ్‌మన్ రికార్డులపై కన్నేసిన కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ తో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండు రికార్డ్స్ పై కన్నేశాడు. వీటిలో ఒకటి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ కాగా.. మరొకటి ఆల్ టైం గ్రేట్ బ్యాటర్ బ్రాడ్ మాన్ ది. ఇప్పటివరకు కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ లో 26965 పరుగులు చేశాడు. మరో 35 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో వేగంగా 27000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ సచిన్ పై ఉండగా... కోహ్లీ ఈ రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. 

సచిన్ టెండూల్కర్,కుమార్ సంగక్కర,రికీ పాంటింగ్ మాత్రమే ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో 27000 పరుగులు చేశారు. ఫీల్డర్ గాను టెస్ట్ క్రికెట్ లో మరో మూడు క్యాచ్ లు తీసుకుంటే సచిన్ ను అధిగమిస్తాడు. అదే జరిగితే టెస్ట్ క్రికెట్ లో భారత్ తరపున అత్యధిక క్యాచ్ లు అందుకున్న మూడో ఫీల్డర్ గా నిలుస్తాడు. ఈ ఫార్మాట్‌లో రాహుల్ ద్రవిడ్ భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు (210) అందుకున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ 135 క్యాచ్‌లతో రెండవ స్థానంలో ఉన్నాడు.

ALSO READ | IND vs BAN 2024: టీమిండియా స్క్వాడ్ నుంచి సర్ఫరాజ్ ఔట్.. కారణం ఏంటంటే..?

టెస్ట్ క్రికెట్ లో ఇప్పటివరకు 29 సెంచరీలు చేసిన కోహ్లీ.. మరో సెంచరీ చేస్తే బ్రాడ్ మాన్ సెంచరీల రికార్డ్ అధిగమిస్తాడు. బ్రాడ్ మన్, కోహ్లీ సంయుక్తంగా 29 సెంచరీలు సెంచరీలు చేశారు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ పెద్దగా ఫామ్ లో కనిపించడం లేదు. గత రెండేళ్లలో అతని యావరేజ్ బాగా తగ్గిపోయింది. ఇటీవలే బంగ్లాతో ముగిసిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 6.. రెండో ఇన్నింగ్స్ లో 17 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది.