మరికాసేపట్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు వాంఖడే స్డేడియం వేదిక కానుంది. టోర్నీలో టాప్ స్కోరర్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 9 మ్యాచుల్లో 99 సగటుతో 594 పరుగులు సాధించాడు. ఇదే ఫామ్ ను కోహ్లీ కంటిన్యూ చేస్తే సచిన్ పేరిట ఉన్న మూడు రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే కోహ్లీ 49 సెంచరీలు కంప్లీట్ చేసి సచిన్ తో సమానంగా ఉన్నాడు. లీగ్ స్టేజ్ మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు కానీ వాటిని సెంచరీలుగా మల్చలేకపోయాడు. ఈసారి కోహ్లీ సెంచరీ చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2003 వరల్డ్ కప్ లో సచిన్ 673 పరుగులు చేశాడు. ఆ రికార్డును అధిగమించే అవకాశం ఇప్పుడు కోహ్లీకి ఉంది. ఇప్పుడు 594 పరుగులతో ఉన్న కోహ్లీ న్యూజిలాండ్ పై మంచి ఇన్ని్ంగ్స్ ఆడితే సచిన్‌ను అధిగమించగలడు.
ఇక కోహ్లీ ఈ వరల్డ్ కప్‌లో ఏడుసార్లు 50+ స్కోర్లు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దీంతో సచిన్ (7), షకిబ్ అల్ హసన్ (7)తో కలిసి ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కోహ్లీ ఒక్క హాఫ్ సెంచరీ చేస్తే వారిని అధిగమిస్తాడు.