
మ్యాచ్‌లో తొలి రోజే భద్రతా వైఫల్యం బయటపడింది. మూడో సెషన్‌లో ఇండియా ఇన్నింగ్స్ మొదలవుతున్న సమయంలో సౌత్ స్టాండ్ నుంచి ఓ అభిమాని భద్రతా సిబ్బంది కండ్లుగప్పి ఫెన్సింగ్ దూకి గ్రౌండ్‌లోకి వచ్చాడు. కోహ్లీ జెర్సీ వేసుకున్న అతను నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో రోహిత్ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కాడు. హగ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది వచ్చి బయటకు తీసుకెళ్లారు. మరోవైపు క్యాటరింగ్ వెహికిల్స్‌ను పోలీసులు గేట్ల వద్ద నిలిపివేయడంతో అధికారులు, కార్పొరేట్ టికెట్లు కొన్నవాళ్లు, మీడియా, బ్రాడ్ కాస్టింగ్ సిబ్బంది సకాలంలో లంచ్ రాక ఇబ్బంది పడ్డారు.