లా ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో కోహ్లీ గురించి ప్రశ్న.. ఏం అడిగారో తెలుసా?

లా ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో కోహ్లీ గురించి ప్రశ్న.. ఏం అడిగారో తెలుసా?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విరాట్.. ప్రపంచలో చాలామంది క్రికెటర్లకు ఆదర్శం. ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఈ ఢిల్లీ స్టార్ బ్యాటర్ దేశానికే గర్వకారణం. ఇటీవలే వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసి సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ.. ఈ ఘనత అందుకున్న తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా..విరాట్ కోహ్లీ పేరు పుస్తకాల్లోనే కాదు పరీక్షల రూపంలో ఎదురవుతుంది.  

తాజాగా కోహ్లీకి సంబంధించిన ఒక ప్రశ్న ఆల్ ఇండియా లా పరీక్షల్లో అడగడం విశేషం. ఇటీవలే AILET (All India Law Entrance Test) ఎంట్రన్స్ ఎగ్జామ్ లో జరగ్గా.. ఐపీఎల్ కు సంబంధించిన ప్రశ్న వైరల్ గా మారుతుంది. ఈ ప్రశ్న ఏమిటంటే.. 2008 లో ఐపీఎల్ మొదలైంది. ఈ మెగా టోర్నీలో 2008 నుంచి ఇప్పటివరకు ఒకే జట్టు తరపున ఆడిన ప్లేయర్ ఎవరు? దీనికి సంబంధించిన ఆప్షన్ లు బెన్ స్టోక్స్, వార్నర్, హార్దిక్ పాండ్య, విరాట్ కోహ్లీ ఉన్నాయి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం విరాట్ కోహ్లీ అని ప్రతి క్రికెట్ లవర్ కు తెలుసు. 

వార్నర్ ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ జట్ల తరపున ఆడాడు. బెన్ స్టోక్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, పూణే వారియర్స్ ఇండియ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఇక హార్దిక్ పాండ్య ముంబై, గుజరాత్ జట్లకు ఆడాడు. ఒక్క కోహ్లీ మాత్రమే రాయల్ చాలెంజర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. మొత్తం 16 సీజన్లు ఐపీఎల్ ఆడిన కోహ్లీ.. 237 మ్యాచ్ ల్లో 7263 పరుగులు చేసాడు. 7 సెంచరీలతో పాటు 50 హాఫ్ సెంచరీలు విరాట్ ఐపీఎల్ కెరీర్ లో ఉన్నాయి.