టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డుల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విరాట్.. తాజాగా మరో రెండురికార్డులపై గురి పెట్టాడు. వీటిలో ఒకటి వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డ్. ఇప్పటికే వన్డే క్రికెట్ లో 48 సెంచరీలు చేసిన కోహ్లీ.. ఈ రోజు సెంచరీ చేస్తే 49 సెంచరీలతో వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా క్రికెట్ గాడ్ సచిన్ రికార్డ్ సమం చేస్తాడు. ఇక ఈ క్రమంలోనే మరో రికార్డ్ కోహ్లీని ఊరిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ లో నేడు భారత్-శ్రీలంక ,మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై వాంఖడేలో జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో సచిన్ 16 ఏళ్ళ అరుదైనా రికార్డ్ పై కోహ్లీ దృష్టి పెట్టాడు. వన్డేల్లో క్యాలెండర్ లో( జనవరి-డిసెంబర్) కోహ్లీ ఇప్పటివరకు 7 సార్లు 1000 పరుగులు మార్క్ అందుకున్నాడు. 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019 సంవత్సరాలలో కోహ్లీ 1000 కి పైగా పరుగులు చేసాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సైతం 7(1994, 1996, 1997, 1998, 2000, 2003, 2007) సార్లు ఈ ఘనత సాధించగా..ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
ప్రస్తుతం కోహ్లీ ఈ ఏడాది 22 వన్డేలు ఆడి 966 పరుగులు చేసాడు. విరాట్ ఖాతాలో నాలుగు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది మరో 34 పరుగులు పరుగులు చేస్తే 8 సార్లు ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలుస్తాడు. ఈ ఏడాది కోహ్లీ ఈ రికార్డ్ బద్దలు కొట్టడం ఖాయమే అయినప్పటికీ నేడు జరిగే మ్యాచ్ లో బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక వీరిద్దరి తర్వాత భారత మాజీ సారధి సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్, శ్రీలంక మాజీ స్టార్ ప్లేయర్ కుమార సంగక్కర 6 సార్లు ఈ ఫీట్ నమోదు చేశారు.
Also Read : ODI World Cup 2023: ముంబై మ్యాచ్ కు అతిరథ మహారథులు : రజినీకాంత్ ఎందుకొస్తున్నట్లు..!
ప్రస్తుతం భారత కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ 5 సార్లు 1000 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ హవా కొనసాగుతుంది. ఆడిన 6 మ్యాచ్ ల్లో 354 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 7 వ స్థానంలో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా స్టార్ ఓపెనర్ డికాక్ 545 పరుగులతో ఈ లిస్టులో టాప్ లో ఉన్నాడు. కాగా.. ఈ మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది. మరో వైపు శ్రీలంక ఓడితే ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. మరి వాంఖడేలో కోహ్లీ మరో భారీ ఇన్నింగ్స్ తో సచిన్ 16 ఏళ్ళ రికార్డ్ బ్రేక్ చేస్తాడో లేదా చూడాలి.
Are you ready !!!!
— Aditya joshi (@ADITYAJOSHI4) October 29, 2023
Run chasser Virat Kohli ?
God of cricket - Sachin Tendulkar
Will 49th century records will break ? #INDvsENG #BCCI #Israel #BabarAzam? #ViratKohli? #GOAT? pic.twitter.com/fpdGzUs7H4