మైదానంలో కోహ్లీ దూకుడుగా ఉండటాన్ని అందరికీ తెలిసిందే. ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూనే.. ఫీల్డింగ్ లో అదరగొడతాడు. ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే మాత్రం మాటతో పాటు ఆటతోనే సమాధానం చెబుతాడు. గ్రౌండ్ లో విరాట్ ఉన్నాడంటే అతన్ని గెలకడానికి ప్రత్యర్థి ఆటగాళ్లు వెనకడుగేస్తారు. అయితే కొన్నిసార్లు కోహ్లీ హద్దుమీరి ప్రవర్తిస్తాడనే పేరు కూడా ఉంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. యువ ఆటగాడిపై తన ప్రతాపాన్ని చూపిస్తూ విమర్శకులకు టార్గెట్ అయ్యాడు.
ఐపీఎల్ తొలి మ్యాచ్ లో భాగంగా నిన్న(మార్చి 22) చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. 174 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా న్యూజిలాండ్ యువ ఆటగాడు రచీన్ రవీంద్ర తన తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే అదరగొట్టాడు. కేవలం 15 బంతుల్లో 37 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి.. జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.
కర్ణ్ శర్మ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రచిన్.. తరువాతి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద రజత్ పాటీదార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సమయంలో బిఉండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ పెవిలియన్ వైపు వెళ్లు అని సైగ చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. దిగ్గజ హోదాలో ఉండి స్టార్ ప్లేయర్ ను ఇలా అంటావా అంటూ నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: 20కోట్ల హీరోలపైనే అందరి దృష్టి
ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన చెన్నై సూపర్‌కింగ్స్.. ఐపీఎల్–17లో బోణీ చేసింది. బౌలింగ్‌లో ముస్తాఫిజుర్ (4/29), బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర (37), శివమ్ దూబే (34 నాటౌట్) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో సీఎస్కే 6 వికెట్ల తేడాతో బెంగళూరుకు చెక్ పెట్టింది. టాస్ గెలిచిన బెంగళూరు 20 ఓవర్లలో 173/6 స్కోరు చేసింది. అనూజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ (38 నాటౌట్), కెప్టెన్ డుప్లెసిస్ (35) దంచికొట్టారు.
Shame on you #Viratkohli
— VELAGA VIJAYA KUMAR (@kumarvijayv) March 22, 2024
Virat Kohli abusing and doing sending off gesture to a 22yrs old youngster Rachin ravindra.
People call him king but his attitude and ego don't deserve this name! #CSKvRCB #WhistlePodu #IPLonJioCinema #CSK #TATAIPL2024 pic.twitter.com/1mHkObCN5z