కోహ్లీ కోసం గ్రౌండ్‌‌లోకి వచ్చేశారు..

కోహ్లీ కోసం గ్రౌండ్‌‌లోకి వచ్చేశారు..

న్యూఢిల్లీ : దాదాపు 13 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ ఆడుతున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కోసం  రెండు రోజులుగా  ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి భారీ సంఖ్యలో పోటెత్తిన అభిమానులు మూడో రోజు కట్టు తప్పారు. శనివారం భారీ సంఖ్యలో మోహరించిన భద్రతా సిబ్బంది కండ్లుగప్పిన ముగ్గురు అభిమానులు ఒకేసారి గ్రౌండ్‌‌లో విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లారు. ఓ వ్యక్తి కోహ్లీ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశాడు.  దాదాపు 20 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్లను బయటికి తీసుకెళ్లారు. 

ఆ టైమ్‌‌లో అభిమానులను కొట్టొద్దని కోహ్లీ సెక్యూరిటీకి సూచించినట్టు ఢిల్లీ స్పిన్నర్ శివం శర్మ తెలిపాడు. కాగా,ఈ మ్యాచ్‌‌లో ఢిల్లీ ఇన్నింగ్స్‌‌ 19 రన్స్ తేడాతో రైల్వేస్‌‌పై  విజయం సాధించింది. దాంతో కోహ్లీ మరోసారి బ్యాటింగ్‌‌కు రాలేకపోయాడు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌‌లో 374  వద్ద ఆలౌటైంది. ఫలితంగా 133 రన్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌కు వచ్చిన రైల్వేస్‌‌ 114 రన్స్‌‌కే కుప్పకూలింది.