బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు విదేశాల్లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు. తాజాగా కాన్పూర్ వేదికగా జరిగిన టెస్ట్ అతని కెరీర్ లో చివరి విదేశీ సిరీస్. ఈ సిరీస్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సంతకం చేసిన బ్యాట్‌లో ఒకదాన్ని షకీబ్ కు బహుమతిగా ఇచ్చాడు. టీమిండియా విజయం సాధించిన తర్వాత కోహ్లి బంగ్లాదేశ్ జట్టు వైపు నడుస్తూ షకీబ్ ను కలిసి బ్యాట్‌ను అందజేశాడు. ప్రస్తుతం కోహ్లీ చూపించిన ఈ క్రీడా స్ఫూర్తికి నెటిజన్స్ ను ప్రశంసలు లభిస్తున్నాయి.
దక్షిణాఫ్రికాతో అక్టోబర్ నెలలో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు షకీబ్ ఎంపిక కావడం కష్టంగా కనిపిస్తుంది . దీంతో షకీబ్ తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆడే అవకాశం రాకపోతే కాన్పూర్ (ఇండియాతో రెండో టెస్ట్) మ్యాచే తన కెరీర్‌లో చివరిది అవుతుందని ఇప్పటికే షకీబ్ వెల్లడించాడు. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సీనియర్ ఆల్ రౌండర్.. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీతో వన్డేలకు గుడ్‌బై చెబుతానని స్పష్టం చేశాడు.
ALSO READ | IND vs BAN 2nd Test: ఛాలెంజ్‌కు రెడీ.. 100 పరుగులకు ఆలౌటైనా పర్లేదు: రోహిత్ శర్మ
బంగ్లాదేశ్ తరఫున 129 టీ20లు ఆడిన షకీబ్ 23.19 యావరేజ్‌తో 2551 రన్స్ చేశాడు. ఇందులో13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. షార్ట్ ఫార్మాట్‌లో149 వికెట్లు తీశాడు. ఇక 70 టెస్ట్‌ల్లో 4609 రన్స్, 246 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌లో మిర్పూర్‌కు చెందిన షకీబ్.. షేక్ హసీనా గవర్నమెంట్‌లో ఎంపీగా కూడా గెలిచాడు. అయితే ఇటీవల జరిగిన అల్లర్లలో అతనిపై ఓ హత్యానేరం కేసు నమోదైంది. దీంతో భవిష్యత్‌లో క్రికెట్ ఆడే అవకాశాలపై సందిగ్ధత నెలకొనడంతో రిటైర్మెంట్‌కు మొగ్గు చూపాడు.
Virat Kohli gave his signed bat to Shakib Al Hasan.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2024
- Picture of the day! ❤️ pic.twitter.com/mJKSDk6gnR