
సాధారణంగా మ్యాచ్ తర్వాత ఒకరి డ్రెస్సింగ్ రూమ్ లోకి మరొకరు వెళ్ళరు. నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ ఆటగాళ్లు ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. తమ ఆనందాన్ని షేర్ చేసుకొని బెంగళూరు ఆటగాళ్లతో సరదాగా గడిపారు. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఓడిపోయిన తర్వాత ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్ స్పీచ్ ఇస్తున్నాడు.
ఈ వీడియోను ఆర్సీబీ తన ఎక్స్ లో పోస్ట్ చేయగా ఇందులో ఆసక్తికర సంఘటన ఒకటి కనిపించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతుంది. ఈ వీడియోలో రింకూ సింగ్ కు విరాట్ తన బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. కోహ్లీ తన స్పోర్ట్స్‌మెన్‌షిప్ ను చూపిస్తూ.. తన స్నేహానికి గుర్తుగా రింకూకు తన బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఆర్సీబీ తరపున ఆడుతున్న కోహ్లీ ఈ మ్యాచ్ లో 59 బంతుల్లోనే 4 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ 5 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఈ మ్యాచ్ లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యాన్ని మరో 19 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది.
Virat Kohli gifted a bat to Rinku Singh after yesterday's match.
— Johns (@JohnyBravo183) March 30, 2024
King 🤝 King-ku pic.twitter.com/MkLJe3ARmn