రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ పై గెలిచి టీమిండియా 3-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో రోహిత్(55), గిల్(52), జురెల్(39) రాణించడంతో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత వరుసగా వైజాగ్, రాజ్ కోట్, రాంచీ టెస్టులో వరుస విజయాలతో మరో టెస్ట్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. విజయానందంలో భారత్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ ప్రశంసలు కురిపించాడు.
కోహ్లి భారత జట్టును ప్రశంసిస్తూ.. మన యువ జట్టు ద్వారా అద్భుతమైన సిరీస్ విజయం దక్కింది. గ్రిట్, డిటర్మినేషన్, రెసిలెన్స్ చూపించారని అన్నారు. ఇదిలా ఉండగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకపోవడం క్రికెట్ ప్రేమికులకు తీవ్ర నిరాశను కలిగించింది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న విరాట్.. చివరి మూడు టెస్టులకు కూడా దూరమవ్వడంతో సిరీస్ కల తప్పిందని అభిమానులు భావిస్తున్నారు.
విరాట్ కోహ్లీ , అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15వ తేదీన అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రెండో బిడ్డకు అకాయ్ అని నామకరణం చేశామని చెప్పుకొచ్చాడు. అందరి ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కావాలని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. కుమారుడికి అకాయ్ (Akaay) అని పేరు పెట్టినట్టు విరాట్, అనుష్క తెలిపారు. ఈ కారణంగానే కోహ్లీ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.
Virat Kohli tweets after India's series against England.. pic.twitter.com/EnWIb1K4Z0
— RVCJ Media (@RVCJ_FB) February 26, 2024