IND vs PAK: ఆటిట్యూడ్ చూపించినా అభినందించాడు: పాక్ బౌలర్‌ను పొగిడిన కోహ్లీ

IND vs PAK: ఆటిట్యూడ్ చూపించినా అభినందించాడు: పాక్ బౌలర్‌ను పొగిడిన కోహ్లీ

కోహ్లీ అంటే అగ్రెస్సివ్.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు కోహ్లీ అంటే కూల్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మధ్య కోహ్లీ ప్రవర్తిస్తున్న తీరు అలాగే ఉంది. గ్రౌండ్ లో దూకుడుగా ఉంటున్నా.. వ్యక్తిగతంగా ఎవరి మీద కయ్యానికి కాలు దువ్వడం లేదు. ఒకప్పుడు ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే అసలు ఊరుకొని కోహ్లీ.. ఇప్పుడు తన పని తాను చేసుకుపోతున్నాడు. తనతో గొడవపడినవారిని కూడా మిత్రులుగా మార్చుకుంటున్నాడు. ఆదివారం (ఫిబ్రవరి 23) ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై ఎంతో కూల్ గా కనిపించాడు. ప్రశాంతంగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మ్యాచ్ లో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఆటిట్యూడ్ చూపించినా కోహ్లీ మాత్రం అతని బౌలింగ్ ను మెచ్చుకున్నాడు. ఇన్నింగ్స్ 17 18 ఓవర్ లో ఒక అద్భుతమైన బంతితో అబ్రార్ టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్ ను బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్ మూడో బంతిని క్యారం బాల్ తో సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ ను బోల్తా కొట్టించాడు. ఈ స్టన్నింగ్ డెలివరీకి గిల్ షాక్ లో ఉండిపోయాడు. వికెట్ తీసిన వెంటనే పాక్ స్పిన్నర్ చేసిన ఓవరాక్షన్ టీమిండియా ఫ్యాన్స్ కు నచ్చలేదు. నిలబడి పేస్ పక్కకి తిప్పుతూ గిల్ ను పెవిలియన్ కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. వికెట్ తీసినా అతని ఆటిట్యూడ్ పై విమర్శలు వచ్చాయి.  

కోహ్లీ మాత్రం ఇవేమీ మనసులో పెట్టుకోకుండా అబ్రార్ బౌలింగ్ ను ప్రశంసించాడు. ఈ పాక్ స్పిన్నర్ స్పెల్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తూ అభినందిచాడు. కోహ్లీ చూపించిన మంచి మనసుకి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మ్యాచ్ తర్వాత కూడా పాక్ ఆటగాళ్లకు  కోహ్లీ తన విలువైన సూచనలు ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 10 ఓవర్ల స్పెల్ లో అబ్రార్ కేవలం 28 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. సహచర బౌలర్లు విఫలమైనా.. అబ్రార్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరోవైపు కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లతో సెంచరీ చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది.