శ్రీలంకతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు అందరి దృష్టి టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పైనే ఉంది. భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత విరాట్ తొలి వన్డే ఆడబోతున్నాడు. ఈ సిరీస్ కు ముందు కోహ్లీ రికార్డ్స్ శ్రీలంకకు చెమటలు పట్టిస్తున్నాయి. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ స్టేడియంలో కోహ్లీ రికార్డ్స్ అద్భుతంగా ఉన్నాయి.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో కోహ్లీ 11 మ్యాచ్ లాడాడు. 10 ఇన్నింగ్స్ లలో 644 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ ఏకంగా 107 ఉండగా.. స్ట్రైక్ రేట్ 98 ఉంది. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీని ఆపడం లంక బౌలర్లకు సవాలుగా మారింది. పైగా శ్రీలంక జట్టులో ఐదుగురు పేసర్లు ఈ సిరీస్ కు దూరమయ్యారు. ఓవరాల్ గా శ్రీలంకపై కోహ్లీ 51 ఇన్నింగ్స్ ల్లో 50 కి పైగా యావరేజ్ తో 2594 పరుగులు చేశాడు.
ALSO READ ; IND vs SL ODI: దిక్కుతోచని స్థితిలో శ్రీలంక.. వన్దే సిరీస్‌కు ఐదుగురు పేసర్లు దూరం
మూడు వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డే శుక్రవారం (ఆగస్టు 2) జరుగుతుంది. ఆదివారం (ఆగస్టు 4) రెండో వన్డే.. బుధవారం (ఆగస్టు 7) మూడో వన్డే జరుగుతాయి. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. అన్ని మ్యాచ్ లు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. మూడు వన్డేల సిరీస్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Virat Kohli loves playing in colombo, has an average of 107.33 🐐 pic.twitter.com/Bib2FSF6mf
— bhumi _ji (@kohlinature) August 1, 2024