
ఛాంపియన్స్ ట్రోఫీలో వీరోచిత సెంచరీ చేసిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో దూసుకొచ్చాడు. ఐసీసీ బుధవారం (ఫిబ్రవరి 26) ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ 743 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 23 పరుగులు చేసి నిరాశపరిచిన విరాట్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 111 బంతుల్లో సెంచరీ చేశాడు. టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.
పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ రెండో స్థానంలోనే ఉన్నాడు. ఇతర భారత క్రికెటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 3, శ్రేయాస్ అయ్యర్ 9 వ స్థానంలో నిలిచారు. కేఎల్ రాహుల్ 15 స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారీ సెంచరీతో అదరగొట్టిన బెన్ డకెట్ ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో.. విల్ యంగ్ 8 స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ పై సెంచరీతో సత్తా చాటిన రచిన్ రవీంద్ర 18 స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు.
Also Read:-ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లకు మేలు చేసిన వర్షం..
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ మూడో స్థానంలో నిలిచాడు. శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. రషీద్ ఖాన్ రెండో ర్యాంక్ లో ఉన్నాడు. కేశవ్ మహారాజ్ నాలుగో స్థానంలో.. కివీస్ పేసర్ మాట్ హెన్రీ ఆరో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది చెత్త బౌలింగ్ తో ఐదు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.
Virat Kohli,top five,ICC rankings, ODI batters, Pakistan,Cricket News,Latest Cricket News,Cricket News In Telugu,sports news,V6 News