టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెల్‌బోర్న్ ఎయిర్ పోర్ట్‌లో అసహనానికి గురయ్యాడు. టీవీ జర్నలిస్ట్ పై కోహ్లీ కోపానికి గురైనట్టు సమాచారం. బాక్సింగ్ డే రోజున ప్రారంభమయ్యే నాలుగో టెస్టు కోసం భారత జట్టు బ్రిస్బేన్ నుంచి గురువారం (డిసెంబర్ 19) చేరుకుంది. ఈ క్రమంలో కోహ్లీకి మెల్‌బోర్న్ ఎయిర్ పోర్ట్ లో చేదు ఘటన చోటుచేసుకుంది. కోహ్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే కెమెరాలు అన్ని కోహ్లి ఫ్యామిలీపై ఫోకస్ చేశాయి. ఈ విషయం కోహ్లీకి కోపాన్ని తెప్పించింది.
కోహ్లీ అక్కడే ఉన్న ఒక మహిళా జర్నలిస్ట్ తో "నాకు నా పిల్లలతో ప్రైవసీ కావాలి. నన్ను అడగకుండా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు" అని అన్నాడు. కోహ్లీ తన ఫ్యామిలీకి సంబంధించి ఏ విషయాన్ని బయటకు రావడానికి ఆసక్తి చూపించడు. ఇండియాలో తన ప్రైవసీకి మీడియా అడ్డు వస్తారనే కారణంతో వీలు చిక్కినప్పుడల్లా ఫారెన్ ట్రిప్స్ వెళ్లి ఎంజాయ్ చేస్తాడు. ప్రస్తుతం కోహ్లీ ఫ్యామిలీతో ఆస్ట్రేలియాలోని ఉన్నట్టు తెలుస్తుంది. గబ్బా టెస్టుకు అనుష్క శర్మ హాజరైన సంగతి తెలిసిందే.
ALSO READ | Ravichandran Ashwin: నా కెరీర్ ముగిసిపోలేదు.. ఓపిక ఉన్నంత కాలం ఆ జట్టుకే ఆడతా: అశ్విన్
కోహ్లీ టెస్టుల్లో పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక్క సెంచరీ మినహాయిస్తే మిగిలిన ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ తర్వాత అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. మూడు టెస్టుల్లో 126 పరుగులు మాత్రమే చేశాడు. సిరీస్ లో మరో రెండో టెస్టులు మిగిలి ఉన్నాయి. భారత్ సిరీస్ గెలవాలంటే కోహ్లీ నిలకడగా రాణించడం కీలకం. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మూడు టెస్టులు ముగిసాయి. ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి.
Virat Kohli had a confrontation with the Australian media in Melbourne after they were taking pictures of his family without permission. pic.twitter.com/SCPktXtrlU
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) December 19, 2024