ఎంత పని చేశావన్నా.. హాఫ్ సెంచరీ చేసి.. అంతలోనే ఔట్.. నిరాశలో కోహ్లీ ఫ్యాన్స్..!

ఎంత పని చేశావన్నా.. హాఫ్ సెంచరీ చేసి.. అంతలోనే ఔట్.. నిరాశలో కోహ్లీ ఫ్యాన్స్..!

ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకట్టుకున్నాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమి సమస్యతో పరుగులు చేయడానికి తంటాలు పడుతోన్న కోహ్లీ ఈ మ్యాచ్‏లో తిరిగి గాడినపడ్డాడు. అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న వన్డేలో విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. తన శైలీకి భిన్నంగా క్రీజ్‎లోకి వచ్చి రావడంతోనే రన్ మెషిన్ దూకుడు ప్రదర్శించాడు. 

ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా వన్డే ఫార్మాట్‎లో 73 హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ క్రీజ్‎లో కుదురుని హాఫ్ సెంచరీ చేయడంతో విరాట్ అభిమానులు ఖుష్ అయ్యారు. క్రీజ్‎లో కోహ్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా యథేచ్చగా ఆడుతుండటంతో ఇవాళ సెంచరీ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఫ్యాన్స్ ఆశలు నిమిషాల్లోలనే అడియాశలు అయ్యాయి. హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికే కోహ్లీ (55) ఔట్ అయ్యాడు.

Also Read :- సంజు శాంసన్‌కు సర్జరీ

 ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‎లో భారీ షాట్‎కు యత్నించగా.. బాల్ ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని కీపర్ ఫిల్ సాల్ట్ చేతిలో పడింది. దీంతో తీవ్ర నిరాశతో కోహ్లీ క్రీజ్‎ను వీడాడు. ‘‘సెంచరీ చేస్తావనుకుంటే ఎంత పని చేశావన్నా’’ అంటూ కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాధను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెంచరీ మిస్ అయినా.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ టచ్‎లోకి రావడం భారత్‎కు శుభపరిణామని పేర్కొంటున్నారు.

ఇక, మూడు మ్యాచుల వన్డే సిరీస్‎ను 2-0 తేడాతో ఇప్పటికే భారత్ కైవసం చేసుకుంది. చివరి నామామాత్రపు మ్యాచ్‎లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపుఈ మ్యాచ్‎లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ మ్యాచులో విజయం సాధించి.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫికీ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలను ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.