IND vs NZ 2nd Test: కోహ్లీకే ఎందుకిలా.. అంపైర్లు ఎందుకు పగ బడుతున్నారు

IND vs NZ 2nd Test: కోహ్లీకే ఎందుకిలా.. అంపైర్లు ఎందుకు పగ బడుతున్నారు

అంపైర్ కు విరాట్ కోహ్లీకి మధ్య బ్యాడ్ లక్ సెంటిమెంట్ కొనసాగుతోంది. చాలా సార్లు విరాట్ విషయంలో అంపైర్స్ కాల్ ప్రతికూలంగా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పూణే టెస్టులోనూ అదే రిపీట్ అయింది. మూడో బంతికే ఫోర్ కొట్టి ఆత్మవిశ్వాసంతో కనిపించిన కోహ్లీ 17 పరుగుల వద్ద ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీని బౌల్డ్ చేసిన సాంట్నర్.. రెండో ఇన్నింగ్స్ లోనూ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు పంపాడు. అయితే కోహ్లీని దురదృష్టం వెంటాడింది. 

ఇన్నింగ్స్ 30 ఓవర్లో సాంట్నర్ లెంగ్త్ బాల్ ను కోహ్లి బ్యాక్‌ఫుట్ దిశగా ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బంతి స్కిడ్ అయ్యి ప్యాడ్‌పైకి దూసుకొచ్చింది. ప్యాడ్లకు తగలడంతో ఔట్ కోసం న్యూజిలాండ్ అప్పీల్ చేసింది. అంపైర్ కోహ్లీని ఔట్ గా ప్రకటించాడు. లెగ్ స్టంప్ ను మిస్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో కోహ్లీ రివ్యూకు వెళ్ళాడు. బాల్ ట్రాకింగ్ లో బంతి వికెట్లను లెగ్ వికెట్ అంచుకు తాకుతున్నట్టుగా చూపించింది. అంపైర్స్ కాల్ రావడంతో కోహ్లీ ఔట్ కాక తప్పలేదు. ఒకవేళ అంపైర్ నాటౌట్ ఇచ్చి ఉంటే కోహ్లీ ఔటయ్యేవాడు కాదు. 

ALSO READ | IND vs NZ 2nd Test: మళ్లీ అదే తడబాటు.. పూణే టెస్టులో ఓటమి దిశగా టీమిండియా

అంపైర్స్ కాల్ విషయంలో కోహ్లీకి ఎప్పుడూ కలిసి రాలేదు. ఫోర్త్ అంపైర్ కూడా గతంలో కోహ్లీకి ప్రతికూలంగా నిర్ణయాలు వచ్చేవి. అసలే ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న విరాట్ కు అదృష్టం కూడా కలిసి రావడం లేదు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ ఒక పరుగు మాత్రమే చేశాడు. కోహ్లీ ఔటవ్వడంతో పూణే టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. 359 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు టీ విరామ సమయానికి 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.