బాబర్ ఆజంతో కోహ్లీని పోల్చద్దు, బాబర్ ముందు కోహ్లీ జీరో..: పాక్ మాజీ వివాదాస్పద వ్యాఖ్యలు

బాబర్ ఆజంతో కోహ్లీని పోల్చద్దు, బాబర్ ముందు కోహ్లీ జీరో..: పాక్ మాజీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా ఓడి ఇంటిదారి పట్టినా.. పాకిస్తాన్ ఆటగాళ్ల నోటికి హద్దు అదుపు ఉండట్లేదు. పొద్దున్నే లేచింది మొదలు.. భారత క్రికెట్‌పై, ఆటగాళ్లపై ఏదో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీవీల ముందు కూర్చునేసరికి హీరోల్లా ఫీలవుతూ నోటికొచ్చింది వాగుతున్నారు.

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై హెచ్చు మీరి వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీని తీవ్రంగా విమర్శించాడు. బాబర్ ఆజం గణాంకాలతో పోలిస్తే కోహ్లీ ఏమీ లేడని, భారత స్టార్ జీరో అని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఇటీవలి ప్రదర్శనల గురించి జరిగిన చర్చలో మొహ్సిన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"ముందుగా, అందరికీ నేనొక ఒక విషయం చెప్పాలి. బాబర్ అజామ్‌తో పోలిస్తే విరాట్ కోహ్లీ ఏమీ లేదు. కోహ్లీ సున్నా. ఇక ఈ విషయం గురించి వదిలేద్దాం.." 

"మనం ఇక్కడ ఎవరు మంచి ఆటగాడు అనే దాని గురించి మాట్లాడటం లేదు. మనం మన క్రికెటర్ల గురించి, పాకిస్తాన్ క్రికెట్ గురించి మాట్లాడుతున్నాము. అది నాశనం అవుతోంది. ప్రణాళికలంటూ లేవు, వ్యూహాలు లేవు, యోగ్యత లేదు, ఓడితే ఎలా తలెత్తుకు తిరగగలం అనే జవాబుదారీతనం లేదు.." అని మొహ్సిన్ ఖాన్ ARY న్యూస్‌తో అన్నారు.

కోహ్లీ సెంచరీ..

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ ఫామ్‌తో ఇబ్బంది పడినప్పటికీ, ప్రస్తుతం అటువంటిదేమీ కనిపించడం లేదు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఏకంగా సెంచరీ చేశాడు. మరోవైపు, బాబర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు లేనే లేవు. ఈ టోర్నీలో అతడు చేసిన మొత్తం పరుగులు.. 87. ఇటువంటి ప్రదర్శనను మొహ్సిన్ ఖాన్ గొప్పగా చెప్పుకోవడాన్ని భారత అభిమానులు సిగ్గుచేటుగా అతనికి బుద్ధి చెప్తున్నారు.