ఆస్ట్రేలియాతో పింక్ టెస్ట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ కనిపించలేదు. ఈ ముగ్గురు తప్ప దాదాపుగా స్క్వాడ్ మొత్తానికి ప్రాక్టీస్ లభించింది. అయితే వీరు ఎందుకు బరిలోకి దిగలేదో కారణం లేకపోలేదు. చివరి రోజు కేవలం 46 ఓవర్ల మాత్రమే ఉండడంతో కోహ్లీ యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడానికి తన ప్రాక్టీస్ త్యాగం చేసినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ కు ప్రాక్టీస్ అవసరం పెద్దగా అవసరం లేదు.
గతంలోనూ పింక్ బాల్ టెస్ట్ లో కోహ్లీకి అద్భుతమైన రికార్డ్ ఉంది. బంగ్లాదేశ్ పై సెంచరీతో పాటు.. ఆస్ట్రేలియాపై అడిలైడ్ లో హాఫ్ సెంచరీ కూడా ఉంది. మరోవైపు కీలకమైన స్టార్ పేసర్ బుమ్రాను రెండో టెస్ట్ సమయానికి తాజాగా ఉంచాలని బరిలోకి దించలేదని తెలుస్తుంది. వికెట్ కీపర్ పంత్ పై పని భారం తగ్గించాలని అతన్ని ప్రాక్టీస్ కు దూరంగా ఉంచినట్టు అర్ధమవుతుంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది.
ALSO READ : IPL 2025: అయ్యర్, నరైన్, రస్సెల్‌కు షాక్.. కోల్‌కతా కెప్టెన్‌గా టెస్ట్ స్పెషలిస్ట్
ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా అదరగొట్టింది. తొలి రోజు వర్షంతో రద్దవగా.. రెండో రోజు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టార్గెట్ ఛేజింగ్‌లో శుభ్‌మన్ గిల్ (50), యశస్వి జైస్వాల్ (45), నితీశ్ కుమార్ (42), సుందర్ (42) రాణించడంతో ఇండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌పై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పీఎం ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 రన్స్‌కు ఆలౌటైంది. సామ్ కొన్‌స్టాస్ (107) సెంచరీతో చెలరేగగా, హనో జాకబ్స్ (61), జాక్ క్లెటాన్ (40) ఆకట్టుకున్నారు.