బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. టీ20 వరల్డ్ కప్ నుంచి విరాట్ కోహ్లీ ఔట్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వెస్టిండీస్, USAలలో జరగబోయే 2024 T20 ప్రపంచ కప్ కు టీమిండియా నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు  నివేదికలు చెబుతున్నాయి. కరేబియన్‌లోని స్లో పిచ్ లపై కోహ్లీ బ్యాటింగ్ సరిపోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి, సెలక్షన్ కమిటీ భావిస్తోందట. ఈ విషయంలో కోహ్లీని ఒప్పించే బాధ్యతను సెలక్టర్ అగార్కర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. 

టీ20 వరల్డ్ కప్ లో బీసీసీఐ యంగ్ స్టార్స్ మీద దృష్టి పెట్టింది. కోహ్లీ గైర్హాజరీలో కిషాన్, గైక్వాడ్, గిల్, రింకూ సింగ్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, జైస్వాల్ దాదాపుగా కన్ఫర్మ్ కాగా.. ఆ తర్వాత కిషాన్ లేదా గిల్ ఆడే అవకాశముంది. సూర్య కుమార్ యాదవ్, హార్దిక పాండ్య, రింకూ సింగ్, జడేజా ఉండనే ఉన్నారు. ఇటీవలే టెస్ట్ సిరీస్ లో సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా మీద వేటు వేసి కుర్రాళ్లకు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ బ్యాటర్ కోహ్లీ మీద వేటు వేయడం ఖాయంగా కనిపిస్తుంది. 

ALSO READ :- ఆ దర్శకుడు సూర్య కిరణ్ను ఎందుకు కొట్టాడు.. వైరల్ అవుతున్న వీడియో

భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ కేవలం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. తొలి టీ20 మ్యాచ్ కు దూరం కాగా రెండో మ్యాచ్ లో 29 పరుగులు చేశాడు. ఇక మూడో టీ20లో తొలి బంతికే ఔటయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ కు సిద్ధమవుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి ఐపీఎల్ ప్రదర్శన కోహ్లీ టీ20 వరల్డ్ కప్ ఆశలను సజీవంగా ఉంచుతుందో లేదో చూడాలి.